జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పగలు తేలికపాటి వర్షపాతం నమోదైంది.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పగలు తేలికపాటి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యల్లనూరులో 22 మి.మీ, పుట్లూరు 19 మి.మీ, బొమ్మనహాల్ 13 మి.మీ, అనంతపురం 12 మి.మీ, అగళి 12 మి.మీ, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం కురిసింది.
తాడిమర్రి, రాప్తాడు, కూడేరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తనకల్లు, ఉరవకొండ, గాండ్లపెంట, కనగానపల్లి, కనేకల్లు, గుత్తి, వజ్రకరూరు, ఓడీ చెరువు, రొద్దం, శింగనమల, గార్లదిన్నె, ముదిగుబ్బ తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.