నాలుగు రోజుల్లో వర్షసూచన | rain in four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో వర్షసూచన

Aug 22 2017 10:00 PM | Updated on Jun 1 2018 8:39 PM

రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం  ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు 14 నుంచి 23 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 7 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement