పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీ | PV Sindhu victory rally | Sakshi
Sakshi News home page

పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీ

Aug 20 2016 8:51 PM | Updated on Sep 4 2017 10:06 AM

పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీ

పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీ

సింధును స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఒలింపియన్‌లు తయారు కావాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ కైత్‌ సురేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

గుంటూరు స్పోర్ట్స్‌: సింధును స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఒలింపియన్‌లు తయారు కావాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ కైత్‌ సురేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ స్డేడియంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ఒలింపిక్స్‌ రజత పతక విజేత పి.వి.సింధు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి జస్టిస్‌ కైత్‌ సురేష్‌ కుమార్, తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో సింధు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఆమె స్ఫూర్తితో క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు.  ఆలపాటి రాజా మాట్లాడుతూ సింధు విజయం ఒక సంచలనం అన్నారు. ర్యాలీ స్డేడియం ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్డేడియం పాలకవర్గ సభ్యులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement