మండలంలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లను గుంటూరు రేంజి ఐజీ సంజయ్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మహానాడు రైల్వే వంతెన వరకు పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు.
పుష్కరాలకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు
Jul 19 2016 8:35 PM | Updated on Aug 21 2018 5:54 PM
పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజీ సంజయ్
సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లను గుంటూరు రేంజి ఐజీ సంజయ్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మహానాడు రైల్వే వంతెన వరకు పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. సీతానగరం దిగువన పోలీసు శాఖకు కేటాయించిన మత్స్యకారుల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఘాట్ల వెంట వాచ్ టవర్ల ఏర్పాట్లపై సూచనలిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో గుర్తిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఎస్పీ రామాంజనేయులు ఉన్నారు.
Advertisement
Advertisement