పక్కా ప్రణాళికతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు.
పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం
Jan 28 2017 12:17 AM | Updated on Mar 21 2019 8:35 PM
కర్నూలు(హాస్పిటల్): పక్కా ప్రణాళికతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. మండల అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 29న అన్ని పీహెచ్‌సీలు, హెల్త్ సెంటర్లలో, పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ బూత్‌లలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ నెల 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో గంగాధర్‌గౌడ్, డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రనాథ్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement