పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలి | public fight | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలి

Oct 17 2016 10:44 PM | Updated on Oct 2 2018 6:46 PM

అ ణగారిన వర్గాల ప్రజ లు ప్రజా పోరాటాల తోనే హక్కులు సా ధించుకోవాలని అణగారిన కులాల సమా ఖ్య (డీసీఎఫ్‌) రాష్ట్ర అ ధ్యక్షుడు దోనం నీలకంఠం అన్నారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్‌లో బొజ్జా తారకం ప్రాంగణంలో డీసీఎఫ్‌ ఆధ్వర్యంలో అణగారిన ప్రజాపోరు సభ సోమవారం జరిగింది. ముందుగా అంబేడ్కర్, పూలే, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు డీసీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డోకుబుర్ర భద్రం (మాస్టార్‌) అధ్యక్షత వహించ

కాకినాడ  కల్చరల్‌: 
అ ణగారిన వర్గాల ప్రజ లు ప్రజా పోరాటాల తోనే హక్కులు సా ధించుకోవాలని అణగారిన కులాల సమా ఖ్య (డీసీఎఫ్‌) రాష్ట్ర అ ధ్యక్షుడు దోనం నీలకంఠం అన్నారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్‌లో బొజ్జా తారకం ప్రాంగణంలో డీసీఎఫ్‌ ఆధ్వర్యంలో అణగారిన ప్రజాపోరు సభ సోమవారం జరిగింది. ముందుగా అంబేడ్కర్, పూలే, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు డీసీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డోకుబుర్ర భద్రం (మాస్టార్‌) అధ్యక్షత వహించారు. అంబేడ్కర్‌ లండన్‌ గ్రంథాలయంలో చదివి సముపార్జించిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో దళితుల సంక్షేమానికి వినియోగించారని మరో అతి థిగా విచ్చేసిన రాషీ్ట్రయ దళిత సేవ జాతీయ నాయకులు జేబీ రాజు అన్నారు.  దళితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని దళిత బహుజన నేత నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. ఐక్యతతో ప్రజా పోరాటం చేస్తేనే అణగారిన వర్గాలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ అన్నారు. పలువురు ప్రముఖులకు సన్మానాలు చేశారు. ముందు భానుగుడి సెంటర్‌ నుంచి ఆనందభారతి వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా గాయకులు జయరాజ్, బహుజన కళామండలి సభ్యుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. గుడాల కృష్ణ, కొత్తపల్లి  కిషోర్‌కుమార్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement