పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి | Pshyco attack on girl student in narsapuram | Sakshi
Sakshi News home page

పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి

Aug 28 2015 11:47 AM | Updated on Sep 3 2017 8:18 AM

పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు.

నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు. బైక్పై వచ్చిన సైకో స్థానిక జగన్నాథస్వామి ఆలయం సమీపంలోని మున్సిపల్ స్కూల్ లోపలికి వెళ్తున్న పల్లా కరుణ అనే విద్యార్థిని చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. దాంతో అక్కడే ఉన్న స్థానికులు సైకోను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

కానీ అప్పటికే అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే బాలికును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  అయితే బాలిక స్వల్పంగా గాయపడ్డిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సైకో కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement