ఆర్థిక సాయం అందించండి | Provide financial aid | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయం అందించండి

Jul 22 2016 12:48 AM | Updated on Sep 4 2017 5:41 AM

ఆర్థిక సాయం అందించండి

ఆర్థిక సాయం అందించండి

నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బం దులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరు గు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు.

  • ఆపన్నహస్తం కోసం 
  • ఎదురుచూస్తున్న క్రీడాకారులు 
  • ఏటూరునాగారం : నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బం దులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరు గు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు. దాతలు చేయూతనిస్తే పోటీల్లో సత్తా చాటుతామంటున్నారు. మండల కేంద్రానికి చెందిన క్రికెట్‌ క్రీడాకారులు సయ్యద్‌ రియాజ్, ఎండి. ఖయ్యుం మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు జరి గిన అండర్‌ –19 క్రికెట్‌ ఫస్ట్‌ యూత్‌ గేమ్స్‌ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తర ఫున పాల్గొని ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని నేపాల్‌లో ఈ నెల 25 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే సౌత్‌ ఏషియన్‌ క్రికెట్‌ పోటీలకు భాతర జట్టు తరపున ఎంపిక చేశారు. అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి నేపాల్‌ వెళ్లేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బు లేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం, దాతలు  ఆదుకుంటే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతామంటున్నారు. సయ్యద్‌ రియాజ్‌కు సాయం చేసేవారు 8500178436, ఎండి. ఖయ్యుంకు సా యం చేసేవారు 9912613312 నంబ ర్లలో సంప్రదించాలని వారు కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement