breaking news
sportsmen
-
ప్రతిభావంత క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె సచివాలయంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులకు పలు ప్రయోజనాలను చేకూర్చే జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ప్రతి గ్రామంలోను జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను క్రీడాకారులు ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణలపై ఈ సందర్భంగా సమీక్షించారు. జగనన్న స్పోర్ట్స్ యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని స్పోర్ట్స్ క్లబ్బులు, క్రీడాకారుల సమాచారం పొందుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులు ఈ యాప్‌లో తమ క్రీడకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం ద్వారా క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ఘర్షణలకు టీడీపీ కుట్ర అనవసర విషయాలను అడ్డంపెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె తాడేపల్లిలో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించలేదని ప్రశ్నించారు. -
ఆర్థిక సాయం అందించండి
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులు ఏటూరునాగారం : నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బం దులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరు గు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు. దాతలు చేయూతనిస్తే పోటీల్లో సత్తా చాటుతామంటున్నారు. మండల కేంద్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు సయ్యద్ రియాజ్, ఎండి. ఖయ్యుం మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు జరి గిన అండర్ –19 క్రికెట్ ఫస్ట్ యూత్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తర ఫున పాల్గొని ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని నేపాల్‌లో ఈ నెల 25 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే సౌత్ ఏషియన్ క్రికెట్ పోటీలకు భాతర జట్టు తరపున ఎంపిక చేశారు. అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి నేపాల్ వెళ్లేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బు లేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతామంటున్నారు. సయ్యద్ రియాజ్‌కు సాయం చేసేవారు 8500178436, ఎండి. ఖయ్యుంకు సా యం చేసేవారు 9912613312 నంబ ర్లలో సంప్రదించాలని వారు కోరారు. -
క్రికెట్‌తో మరింత బలపడిన స్టార్స్బంధం