ప్రొటోకాల్‌లో తప్పులు దొర్లరాదు | Protocol dorlaradu mistakes | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌లో తప్పులు దొర్లరాదు

Aug 9 2016 12:15 AM | Updated on Sep 28 2018 7:36 PM

అధికారులతో సమీక్షిస్తున్న ఐజీ ఆర్‌.కె.మీనా - Sakshi

అధికారులతో సమీక్షిస్తున్న ఐజీ ఆర్‌.కె.మీనా

రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రొటోకాల్‌ విషయంలో ఎలాంటి తప్పులూ దొర్లేందుకు ఆస్కారం లేకుండా పనియాలని ఐజీ ఆర్‌.కె.మీనా అధికారులను ఆదేశించారు.

అనంతపురం సెంట్రల్‌ :  
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రొటోకాల్‌ విషయంలో ఎలాంటి తప్పులూ దొర్లేందుకు ఆస్కారం లేకుండా పనియాలని ఐజీ ఆర్‌.కె.మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం డీఐజీ ప్రభాకర్‌రావు, పీటీసీ ప్రిన్సిపల్‌ వెంకట్రామిరెడ్డి తదితరులతో ప్రొటోకాల్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
 
పీటీసీ మైదానంలో బాంబ్, డాగ్‌స్కా్వడ్‌తో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒడిశా నుంచి వచ్చిన 74 మంది బెటాలియన్‌ సిబ్బంది సాధనలో పాల్గొన్నారు. లెఫ్టినెంట్‌ కమాండెంట్‌ బాలాజీ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 58 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌.శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది సాధన చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement