తాగునీటి కోసం రాస్తారోకో | Protest For Drinking Water | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం రాస్తారోకో

Aug 11 2016 1:23 AM | Updated on Oct 4 2018 5:34 PM

అమరచింతలో రాస్తారోకో నిర్వహిస్తున్న మహిళలు - Sakshi

అమరచింతలో రాస్తారోకో నిర్వహిస్తున్న మహిళలు

ఆత్మకూర్‌ (నర్వ): అమరచింత గ్రామంలోని సంతోష్‌నగర్‌ కాలనీ వాసులకు వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసులు బుధవారం రోడెక్కి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆత్మకూర్‌ (నర్వ): అమరచింత గ్రామంలోని సంతోష్‌నగర్‌ కాలనీ వాసులకు వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసులు బుధవారం రోడెక్కి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ర హదారిపై వాహన రాకపోకలను అడ్డుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి వ్యవస్థ అçస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వారంరోజుల నుంచి నీటి కష్టాలను అనుభవిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడమేమిటని నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో మరికల్‌ – ఆత్మకూర్‌ రహదారిపై వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఈ మేరకు ఉపసర్పంచు మమతసత్యనారాయణ ఆందోళన కారుల వద్దకు వచ్చి తాగునీరు సకాలంలో సరఫరా అయ్యేల తనవంతు కషి చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement