దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ సోమవారం పెనమలూరులోని రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్‡ కార్యాలయం వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మత్య్స కార్మిక సంఘం మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి ఒడుగు గంగాధరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిమాండ్ల సాధనకు నిరాహారదీక్ష
Jul 30 2016 9:41 PM | Updated on Sep 4 2017 7:04 AM
మచిలీపట్నం సబర్బన్ :
దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ సోమవారం పెనమలూరులోని రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్‡ కార్యాలయం వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మత్య్స కార్మిక సంఘం మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి ఒడుగు గంగాధరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పి గద్దెనెక్కిన తరువాత పాలకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆధాయాన్ని ఇచ్చే మత్య్సకారులను ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. దీనికి నిరసనగా చేపట్టే నిరాహార దీక్షకు మత్య్సకారులందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement