భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే.. | prisoners escaped from central jail | Sakshi
Sakshi News home page

భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..

Nov 12 2016 8:36 AM | Updated on Sep 4 2017 7:55 PM

భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..

భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యారు

వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వరంగల్ అర్బన్ పోలీస్‌లు ఇద్దరి కోసం నగరమంతా జల్లెడ పడుతున్నారు. భోపాల్ జైలు నుంచి సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న మాదిరిగానే దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి ఖైదీలు పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement