పాఠశాలలకు విద్యుత్ కష్టాలు.. | Power struggles to schools .. | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు విద్యుత్ కష్టాలు..

Nov 22 2016 2:56 AM | Updated on Sep 22 2018 7:53 PM

పాఠశాలలకు విద్యుత్ కష్టాలు.. - Sakshi

పాఠశాలలకు విద్యుత్ కష్టాలు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. నీరు, మరుగుదొడ్లు, యూనిఫాంలు, కరెంట్, టేబుళ్లు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది.

బిల్లులు చెల్లించడానికి నిధులు ఇవ్వని ప్రభుత్వం
కనెక్షన్లు కట్ చేస్తున్న అధికారులు


చీపురుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. నీరు, మరుగుదొడ్లు, యూనిఫాంలు, కరెంట్, టేబుళ్లు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అరుుతే ప్రభుత్వాల వైఫల్యాల వల్ల చాలా సౌకర్యాలకు విద్యార్థులు దూరమవుతున్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సరఫరా ఉండాలంటే దాని కోసం ప్రతి నెలా నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పైగా విద్యుత్ సరఫరా అనుమతులు తెచ్చేందుకు ఖర్చులు అవుతారుు. కాని ప్రభుత్వం మాత్రం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు కోసం ఒక్క రూపారుు కూడా వెచ్చించకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే నానా తంటాలు పడుతున్నారు.

 విద్యుత్ సౌకర్యం ఏర్పాటు విషయంలో ఉపాధ్యాయులే ఏవో బాధలు ఎదుర్కొని ఏర్పాటు చేసుకుంటుంటే నెలవారీ బిల్లులకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోంది. బిల్లులు చెల్లించలేకపోవడంతో నియోజకవర్గంలని నాలుగు మండలాల్లో 52 పాఠశాలలకు సరఫరా నిలిపివేసినట్లు ఆర్‌ఈసీఎస్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. మిగిలిన పాఠశాలల్లో కూడా నెలవారీ బిల్లులు చెల్లించేందుకు ఉపాధ్యాయులు అవస్థలు పడాల్సి వస్తోంది.

నిధుల లేమి..
నియోజకవర్గంలోని చీపురుపల్లి మండలంలో 55 మండల పరిషత్ ప్రాథమిక, ఆరు ప్రాథమికోన్నత, ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నారుు. అలాగే గరివిడి మండలంలో 40 మండల పరిషత్ ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మెరకముడిదాం మండలంలో 38 ప్రాథమిక, 11 ప్రాథమికోన్నత, 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. గుర్ల మండలంలో 8 ప్రాథమికోన్నత, 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నారుు. అరుుతే వీటిలో 52 పాఠశాలలకు విద్యుత సరఫరా కట్ చేశారు. ఇంకా చాలా పాఠశాలలు కూడా బిల్లులు చెల్లించేలని దుస్థితిలో ఉన్నారుు. దీంతో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాఠశాలకు వచ్చే ఇతర నిధుల్లో  కొంత మిగిల్చడంతో పాటు దాతల సహకారంతో  బిల్లులు చెల్లిస్తున్నారు.  
 
 ఎంతో అవసరం....
 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సరఫరా అవసరం ఎంతో ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి కోసం ఏర్పాటు చేసే బోరు పని చేయాలన్నా, తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉండాలన్నా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ బోధన జరగాలన్నా, పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా కచ్ఛితంగా విద్యుత్ సరఫరా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ విద్యుత్ నిర్వహణకు నిధులు ఎందుకు కేటారుుంచడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటకై నా ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులు చెల్లించుందుకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement