తహసీల్దార్లకు పోస్టింగ్‌ | postings of tahasildars | Sakshi
Sakshi News home page

తహసీల్దార్లకు పోస్టింగ్‌

Sep 19 2017 9:53 PM | Updated on Apr 4 2019 2:50 PM

ఇటీవలే తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన ఇద్దరికి పోస్టింగ్‌ ఇస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌: ఇటీవలే తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన ఇద్దరికి పోస్టింగ్‌ ఇస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామాంజినేయరెడ్డిని సొమందేపల్లి తహసీల్దారుగా, ఎన్‌.నారాయణను ఆత్మకూరు తహసీల్దారుగా నియమించారు. ఇటీవల జిల్లాకు చెందిన ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం తహసీల్దారులుగా పదోన్నతి కల్పించిన విషయం తెల్సిందే. మొదటి జాబితాలోని ముగ్గురికి ఇటీవలే పోస్టింగ్‌ ఇవ్వగా...ప్రస్తుతం ఇద్దరికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక రెండవ జాబితాలో పదోన్నతి పొందిన ఓబన్న, భాస్కర్‌ నారాయణలను సీసీఎల్‌ఏ ఇంకా జిల్లాలకు కేటాయించలేదు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరికి పోస్టింగ్‌లు ఇస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement