తహసీల్దార్లకు పోస్టింగ్‌ | postings of tahasildars | Sakshi
Sakshi News home page

తహసీల్దార్లకు పోస్టింగ్‌

Sep 14 2017 10:57 PM | Updated on Apr 4 2019 2:50 PM

తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్‌ ఇస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌: తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్‌ ఇస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శీలా జయరామప్పను కేఆర్‌సీ (కోనేరు రంగరావు కమిటీ) విభాగం తహసీల్దారుగా నియమించారు. అలాగే అనిల్‌కుమార్‌ను ఉరవకొండ తహసీల్దారుగా, రామశేఖర్‌ను రొద్దం తహసీల్దారుగా నిమించారు. పదోన్నతులు కల్పించే క్రమంలో జిల్లాకు చెందిన రామాంజినేయరెడ్డి, నారాయణలను చిత్తూరు జిల్లాకు కేటాయించారు. అయితే వీరిద్దరినీ తిరిగి జిల్లాకే కేటాయిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులను జారీ చేసింది. వీరికి కూడా త్వరలో పోస్టింగ్స్‌ ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement