బ్యాంకులతో పోస్టల్‌ ఏటీఎంల అనుసంధానం | postal atms linked with banks | Sakshi
Sakshi News home page

బ్యాంకులతో పోస్టల్‌ ఏటీఎంల అనుసంధానం

Jan 5 2017 12:52 AM | Updated on Sep 5 2017 12:24 AM

బ్యాంకులతో పోస్టల్‌ ఏటీఎంల అనుసంధానం

బ్యాంకులతో పోస్టల్‌ ఏటీఎంల అనుసంధానం

జిల్లాలోని కర్నూలు, ఆదోని హెడ్‌ పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన పోస్టల్‌ ఏటీఎంలు ఇకమీదట బ్యాంకు ఖాతాదారులకు కూడా ఉపయోగపడనున్నాయి.

కర్నూలు (ఓల్డ్‌సిటీ): జిల్లాలోని కర్నూలు, ఆదోని హెడ్‌ పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన పోస్టల్‌ ఏటీఎంలు ఇకమీదట బ్యాంకు ఖాతాదారులకు కూడా ఉపయోగపడనున్నాయి. పోస్టల్‌ ఏటీఎంను బ్యాంకులతో అనుసంధానం చేసినట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు తెలిపారు. బుధవారం తన వద్ద ఉన్న బ్యాంక్‌ ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఏటీఎం కార్డులతో పోస్టల్‌ ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకోవచ్చన్నారు. అయితే వారం రోజుల వరకు తక్కువ డబ్బు పెట్టి ట్రయల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్‌ వెంట పోస్టుమాస్టర్‌ వై.డేవిడ్, పోస్టుమ్యాన్‌ మల్లికార్జున తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement