అక్రమ రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
అరకు లోయ: అక్రమ రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళల నుండి దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన రాసకోడి, పశ్చిమ గోదావరికి చెందిన వీర వెంకట సత్యాలమ్మ, డుంబ్రీగూడ సరాయ్ గ్రామానికి చెందిన వెన్నెల అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డుంబ్రీగూడ మండలం నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.