వరుణదేవా.. కరుణించు ! | poojas for rain in rayadurgam | Sakshi
Sakshi News home page

వరుణదేవా.. కరుణించు !

Jul 7 2017 10:47 PM | Updated on Oct 4 2018 5:44 PM

వరుణదేవా.. కరుణించు ! - Sakshi

వరుణదేవా.. కరుణించు !

వరుణుడి కరుణం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వరుణదేవా...కరుణించవయ్యా అంటూ పూజలు చేస్తున్నారు.

రాయదుర్గం టౌన్‌ : వరుణుడి కరుణం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వరుణదేవా...కరుణించవయ్యా అంటూ పూజలు చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని సిద్దేశ్వర , బైలాంజనేయస్వామి కాలనీవాసులు వర్షం కోసం శుక్రవారం 28వ వార్డులోని పురాతన పాలబావిలో పూజలు, ఊరువాకిలి, బళ్లారి రోడ్లలోని బొడ్రాయికి పూజలు నిర్వహించారు. శాంతినగర్‌లోని బైలాంజనేయస్వామి గుడి వద్ద నుంచి మల్లికార్జున, మారెప్ప ఆధ్వర్యంలో యువతీయువకులు కలశాలతో పాలబావి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బొడ్రాయి వద్దకు చేరుకుని 101 బిందెల నీరు పోసి అభిషేకం, 101 టెంకాయలు సమర్పించి వర్షాలు కురిసి ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రార్థించారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీటితో పాటు పశుపక్షాదులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని, వర్షాభావం నుంచి గట్టెక్కించాలని పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement