వ్యభిచార గృహంపై పోలీసుల దాడి | polie attack on Prostitution house arrest three woman one man | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Sep 18 2017 6:47 AM | Updated on Aug 20 2018 4:30 PM

వివరాలను వెల్లడిస్తున్న సీఐ - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న సీఐ

నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీ పాన బసవతారకనగర్‌లో నివా సాల మద్య వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టూటౌన్‌ పోలీ సులు దాడులు నిర్వహించారు.

అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీ పాన బసవతారకనగర్‌లో నివా సాల మద్య వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టూటౌన్‌ పోలీ సులు దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో పాటు వేశ్యలు, విటుడిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసులుతో కలిసి సీఐ యల్లమరాజు వెల్లడించారు.

ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన అలివేలమ్మ బసవతారకనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని శింగనమలకు చెందిన ఓ మహిళ, తూర్పుగోదావరి జిల్లాకు పెద్దాపురంకు చెందిన ఓ మహిళను పిలిపించుకుని గుట్టుగా వ్యభిచారం సాగిస్తోంది. ఆదివారం ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రఘు అనే విటుడుతో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. డ యల్‌–100కు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు వివరించారు. నిందితులను రిమాం డ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement