బెల్ట్‌షాపులపై పోలీసుల దాడులు | police attacks on belt shops in rangareddy district | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపులపై పోలీసుల దాడులు

Jul 22 2016 3:22 PM | Updated on Aug 21 2018 6:12 PM

రంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు.

మొమిన్‌పేట్: రంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై  పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. జిల్లాలోని మొమిన్‌పేట్ మండలం మోరనాగపల్లి గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముస్తాక్, మానిక్‌జీ, మనయ్యలను అరెస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement