ఆసియా ప్రముఖుల పుస్తకంలో ‘అయినాల’కు చోటు

ఆసియా ప్రముఖుల పుస్తకంలో ‘అయినాల’కు చోటు


గుంటూరు(తెనాలి): రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ ప్రచురించిన ‘ఎమరాల్డ్ హూ ఈజ్ హూ ఇన్ ఆసియా’ పుస్తకంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ‘సహజకవి’ అయినాల మల్లేశ్వరరావుకు చోటు దక్కింది. ఆసియా ఖండంలోని 464 మంది ప్రముఖులతో ముద్రించిన ఈ పుస్తకంలో అయినాల గురించి ప్రచురించారు.ఉపాధ్యాయ వృత్తిలో జాతీయ అవార్డు అందుకున్న అయినాల రచయితగానూ వాసికెక్కారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో పనిచేస్తున్నారు. తాజా గౌరవానికిగాను ఆయనకు పట్టణంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సాహితీమిత్రులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలియజేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top