ఆర్ట్స్‌ కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు | pg cours spot admitions | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

Jul 22 2016 12:47 AM | Updated on Aug 17 2018 3:09 PM

ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 25, 26 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ :
ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల పీజీ కోర్సుల్లో  ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 25, 26 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.  విద్యార్థులు పదోతరగతి సర్టిఫికెట్, డిగ్రీ మార్కుల జాబితా, టీసీ తీసుకుని నేరుగా ప్రిన్సిపల్‌ను కలవాలని సూచించారు.
 
ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఎమ్మెస్సీ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్‌ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement