ఈపీఎఫ్‌పై వడ్డీ ఇక 9 శాతం ? | pf interest rate 2015-16 increase | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌పై వడ్డీ ఇక 9 శాతం ?

Jan 23 2016 1:09 PM | Updated on Sep 3 2017 4:10 PM

ఈపీఎఫ్‌పై వడ్డీ ఇక 9 శాతం ?

ఈపీఎఫ్‌పై వడ్డీ ఇక 9 శాతం ?

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ డిపాజిట్లపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)... తొమ్మిది శాతం వడ్డీ చెల్లించనుంది.

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ డిపాజిట్లపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)... తొమ్మిది శాతం వడ్డీ చెల్లించనుంది. ప్రస్తుతం ఈ ఖాతాలపై 8.75 శాతం వడ్డీ చెల్లిస్తోన్న సంగతి విదితమే. ఇందువల్ల ఐదుకోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి కలగనుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ఓ ట్రస్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి పీజే బనాసురే వెల్లడించారు. ఇటీవల సమావేశమైన ఈపీఎఫ్‌ఓ అనుబంధ ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ (ఎఫ్‌ఏఐసీ)... పీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 8.95 శాతం వడ్డీ చెల్లించాలంటూ సిఫారసు చేసింది. కాగా ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశమవనున్న ఎఫ్‌ఏఐసీ.. పీఎఫ్ డిపాజిట్లపై తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాలంటూ తన సిఫారసును మార్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement