తాగడానికి డబ్బుల్లేక వ్యక్తి ఆత్మహత్య | person suicide | Sakshi
Sakshi News home page

తాగడానికి డబ్బుల్లేక వ్యక్తి ఆత్మహత్య

Oct 21 2016 2:27 AM | Updated on Nov 6 2018 7:56 PM

తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది.

తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. తాళ్లపూడి ఎస్సై జె.సతీష్‌ తెలిపిన కథనం  ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన మజ్జి సింహచలం (50) గొర్రెలను కాసుకుంటూ జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తాగడానికి డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటి పై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడు. మృతుడికి భార్య ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement