అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | person suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Aug 19 2016 1:51 AM | Updated on Sep 4 2017 9:50 AM

పెంటపాడు: పెంటపాడులో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పెంటపాడు పోలీసులు తెలిపారు.

పెంటపాడు: పెంటపాడులో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పెంటపాడు పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపిన  వివరాల ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన బొబ్బిలి బాలగంగాధర్‌తిలక్‌ (33) స్వగ్రామం కొవ్వూరు. ఎనిమిదేళ్లుగా పెంటపాడులో నివాసముంటూ వ్యాన్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా బాలగంగాధరతిలక్‌ అప్పుల బాధతో సతమతమవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం భార్యాపిల్లలను కృష్ణా పుష్కరాలకు పంపాడు. రాత్రి ఇంట్లోని గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. సమీపంలో ఉండే అతని మేనత్త తలుపు కొట్టగా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సాయంలో తలుపులు పగులకొట్టారు. మృతదేహానికి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  మృతునికి భార్య వెంకటలక్ష్మి, దుర్గ, మానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్సై కె.గుర్రయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement