రామయ్యకు నిత్య కల్యాణం | Perennial ramayyaku Kalyanam | Sakshi
Sakshi News home page

రామయ్యకు నిత్య కల్యాణం

Aug 4 2016 11:36 PM | Updated on Sep 4 2017 7:50 AM

స్వామివారికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి గురువారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

  • నేడు శ్రావణ శుక్రవారం పూజలు
  •  
    భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి గురువారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలు తీసుకు వచ్చి భద్రుని గుడిలో అభిషేకం జరిపారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. భక్తుల గోత్రనామాలను చదివారు. మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణం జరిపారు. స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు. 
    – శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామచంద్రస్వామివారి ఉప ఆలయంలోని శ్రీలక్ష్మీతయారమ్మవారి సన్నిధిలో ఉదయం 8.30 గంటల నుంచి అభిషేకం నిర్వహిస్తామని ఈఓ రమేశ్‌బాబు, ప్రధానార్చకులు జగన్నాథచార్యులు తెలిపారు. ప్రాకారమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరపనున్నారు. తిరుచానారులో ఉన్న పద్మావతి అమ్మవార్లకు జరిపిన విధంగానే ధూపదీప నైవేద్యాలు, షోడపచారాలు, సహస్రధారలు, తులసీ మాలలు, కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు, నారీకేళ జలాలు, 108 లీటర్ల క్షీరాలు, హరిద్రాచూర్ణాలు, సమస్త నదీ తీర్థములతో అమ్మవారికి తిరుమంజనం జరపనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement