సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జాతీయపక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతిచెందింది.
విద్యుదాఘాతంతో నెమలి మృతి
Jul 22 2017 11:30 PM | Updated on Sep 5 2018 3:37 PM
సి.బెళగల్ : సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జాతీయపక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతిచెందింది. అడవి నుంచి వచ్చిన నెమలి తీగలపై వాలే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కింద పడింది. స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. నెమలి కళేబరాన్ని స్థానిక పోలీసులకు అప్పగించగా వారు ఖననం చేశారు.
Advertisement
Advertisement