పీడీఎస్‌ బియ్యం పట్టివేత | pds rice caught | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Aug 25 2016 5:16 PM | Updated on Aug 21 2018 5:54 PM

పీడీఎస్‌ బియ్యం పట్టివేత - Sakshi

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

రాజాపేట : రాత్రివేళలో పీడీఎస్‌ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలోని పాముకుంట చౌరస్తాలో బుధవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది.

రాజాపేట : రాత్రివేళలో పీడీఎస్‌ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలోని పాముకుంట చౌరస్తాలో బుధవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం పుట్టగూడెం తండా నుంచి జెగిదేవపూర్‌కి చెందిన వ్యాపారి ఐత కృష్ణకు సంబంధించిన అనుచరులు రాత్రివేళలో లారీలో పీడీఎస్‌ బియ్యాన్ని ౖహె దరాబాద్‌కు తరలిస్తున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఐ బీసన్న, పోలీసులు లారీలో తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఉదయం ఎస్‌ఐ బీసన్న రెవెన్యూ ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌లు కలిసి పంచనామా నిర్వహించారు. లారీలో 220 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement