బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం | Padmanabham polymath | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం

Aug 20 2016 11:36 PM | Updated on Sep 4 2017 10:06 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం

బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం

హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి అని కుటుంబ సభ్యులు, అభిమానులు కొనియాడారు. శనివారం పద్మనాభం జయంతిని ఘనంగా నిర్వహించారు. పద్మనాభం ోదరుడు, నాటి నిర్మాత పురుషోత్తమరావు నివాసంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.

సింహాద్రిపురం :
హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి అని కుటుంబ సభ్యులు, అభిమానులు కొనియాడారు.  శనివారం పద్మనాభం జయంతిని ఘనంగా నిర్వహించారు. పద్మనాభం ోదరుడు, నాటి నిర్మాత పురుషోత్తమరావు నివాసంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ పద్మనాభం మన lసింహాద్రిపురం వాసి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వెండి తెరపై హాస్యాన్ని పండించి చిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.   నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్‌టీఆర్, సావిత్రిల కాంబినేషన్‌లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారన్నారు.  కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పురుషోత్తమరావు, ఆనంద్,  కుసుమకుమారి, చంద్రరేఖ, స్నేహితులు కొండారెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటకృష్ణయ్య, షరీఫ్‌ తదితరుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement