అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం | our target is development | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Aug 16 2016 2:49 AM | Updated on Aug 21 2018 12:18 PM

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం - Sakshi

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

మహా నగర సమగ్ర అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్‌ మహా నగ పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు.

  • నగర వాసులకు మెరుగైన సేవలు అందిద్దాం
  • ‘గ్రేటర్‌’ స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్‌ నన్నపునేని నరేందర్‌
  • వరంగల్‌ అర్బన్‌ : మహా నగర సమగ్ర అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్‌ మహా నగ పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన పోరాట ఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలన్నారు. గ్రేటర్‌లో కొత్త పాలక వర్గం ఏర్పడి ఐదు నెలల కాలం అవుతుందని, తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరయ్యామన్నారు. నగర అభివృద్ధి అన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించామని మేయర్‌ స్పష్టం చేశారు. స్మార్ట్‌ నగరం, విశ్వనగరం ఏర్పాటుకు ప్రతి ఒక్కరం తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆయన విలీన గ్రామాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హరితహారం, రూపాయికి నల్లా కనెక్షన్‌ అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్, కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ఎస్‌ఈ అబ్దుల్‌ రహమాన్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్, వేణుగోపాల్, మేడిది రజిత, రిజ్వనా షమీం, యెలగం లీలావతి, నల్లా స్వరూపరాణి, మరుపల్లి భాగ్యలక్ష్మి, గ్రేటర్‌ సెక్రటరీ నాగరాజరావు, డిప్యూ టీ కమిషనర్లు ఇంద్రసేనారెడ్డి, సురేందర్‌రావు,అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
     
    ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
     
    పలు విభాగాల్లో 30 మంది ఉద్యోగులకు మేయర్, కమిషనర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో వివిధ విభాగాలకు చెందిన ఎస్‌.వీరస్వామి, భాస్కర్, సంతోష్‌బాబు, డి.సంతోష్, లైన్‌మేన్‌ రాజమౌళి, శ్రీనివాసరావు, జన్ను మొగిళి, శ్యామ ల, స్వామి, ఆరోగ్యం, స్వరూప, షేక్‌ అబ్దులయ్య, సర్వ ర్‌ షరీఫ్, వీరప్రతాప్, శ్రీహరి, ప్రకాశ్, శ్రీకాంత్, సం జీవరెడ్డి, సూర్యనారయణ, రాకేష్, షేక్‌ సిద్ధిక్, రాము లు, స్రవంతి, సునీల్‌కుమార్, సుజాత, ఎం.నరేష్, ఈ.జోనా, ఇజ్రాయిల్, విజయ్‌కుమార్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement