డెంగీతో ఒకరి మృతి | one person died with 'dengi' | Sakshi
Sakshi News home page

డెంగీతో ఒకరి మృతి

Aug 2 2016 9:23 PM | Updated on Sep 28 2018 3:41 PM

తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి గ్రామానికి చెందిన గెర్రె చిన్న రాములు (42) డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

తాడ్వాయి :  తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి గ్రామానికి చెందిన గెర్రె చిన్న రాములు (42) డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో  కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని జీవదాన్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రాములుకు డెంగీ లక్షణాలు ఉన్నాయని వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. రాములును హైద్రాబాద్‌లోని ప్రవేటు హాస్పిటాల్‌కు తరలించగా చికిత్స పొందుతూ   సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి మరికొందరు డెంగీతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement