రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | one person died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Nov 2 2016 12:00 AM | Updated on Sep 4 2017 6:53 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

దొరసానిపాడు (ద్వారకాతిరుమల) : ఆర్టీసీ బస్సును మోటార్‌సైకిల్‌ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దొరసానిపాడు (ద్వారకాతిరుమల) : ఆర్టీసీ బస్సును మోటార్‌సైకిల్‌ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు శివారులో మంగళవారం మధాహ్నం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన ఉయ్యూరి దుర్గా మంగేష్‌ (20), రొయ్యల ప్రసాద్‌ స్థానిక మురళీకృష్ణ మెడికల్‌ ఏజెన్సీలో రిప్రజంటేటీవ్‌లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాల్లోని మెడికల్‌ షాపులకు మందులను సరఫరా చేసేందుకు వీరిద్దరూ బైక్‌పై ఈస్టు యడవల్లి మీదుగా ద్వారకాతిరుమలకు వస్తున్నారు. ఈ సమయంలో ద్వారకాతిరుమల నుంచి ఈస్టు యడవల్లి మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్తున్న తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  మంగేష్, ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ స్థానికులు హుటాహుటిన 108లో ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగేష్‌ మృతిచెందాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రసాద్‌ను 108 సిబ్బంది జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్‌సై టి.నాగవెంకటరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement