మాధన్నపేట మత్తడిలో ఒకరు గల్లంతు
మాధన్నపేట చెరువు మత్తడితో పడి ఓ వ్యక్తి గల్లంతయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడికి కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మత్స్యకారులు కూడా కొట్టుకుపోయినప్పటికీ.. కొంతదూరం వెళ్లాక వారు ఓ చెట్టును పట్టుకుని క్షేమంగా బయటపడ్డారు.
మరో ఇద్దరు మత్య్సకారులు సురక్షితం
గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
నర్సంపేటరూరల్: మాధన్నపేట చెరువు మత్తడితో పడి ఓ వ్యక్తి గల్లంతయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడికి కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మత్స్యకారులు కూడా కొట్టుకుపోయినప్పటికీ.. కొంతదూరం వెళ్లాక వారు ఓ చెట్టును పట్టుకుని క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్‌కు చెందిన బల్సూకూరి కృష్ణ (35) మాధన్నపేటకు చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఆ గ్రామంలోనే ఉంటూ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు మత్తడిపోస్తుండడంతో మత్స్యాకారులు చేపలు పడుతున్నారు. కాగా, కృష్ణ కూడా చేపలు పట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. అతడిని కాపాడేందుకు మత్య్సకారులు గిరగాని ఎల్లస్వామి, పెండ్యాల రాజు ప్రయత్నించి వారు కూడా నీటిలో పడి కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్లాకా ఎల్లస్వామి, రాజు చెట్టును పట్టుకుని ఆగిపోయారు. కృష్ణ మాత్రం కనిపించడంలేదు. స్థానికులు ఎల్లస్వామి, రాజును తాడు సహాయంతో బయటకు తీశారు. నర్సంపేట టౌన్ సీఐ, ఎస్సై హరికృష్ణ, రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్తడి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.