అమ్మవారి హుండీలో అంత డబ్బా! | one lakh found in Balkampet Yellamma temple hundi | Sakshi
Sakshi News home page

అమ్మవారి హుండీలో అంత డబ్బా!

Jun 1 2017 9:09 AM | Updated on Sep 5 2017 12:34 PM

అమ్మవారి హుండీలో అంత డబ్బా!

అమ్మవారి హుండీలో అంత డబ్బా!

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి హుండీలో లక్ష రూపాయలు వేశారు.

అమీర్‌పేట(హైదరాబాద్‌): ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి హుండీలో లక్ష రూపాయలు వేశారు. ఇటీవల ఐపీఎల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హుండీలో డబ్బులతో కూడిన కవర్‌ వేశారు. గురువారం ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఆమె వేసిన కవర్‌ను తెరిచి చూడగా రూ.లక్ష ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

తమ జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంతో ఆమె మొక్కు చెల్లించుకున్నారు. నీతా అంబానీ హైదరాబాద్‌ వచ్చినప్పుల్లా బల్కంపేట అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఐపీఎల్‌-10 టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ జట్టు గెల్చుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్ టీమ్‌ను ఓడించి ముంబై జట్టు టైటిల్‌ కైవసం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement