రెండు బైక్‌లు ఢీ..ఒకరు మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ..ఒకరు మృతి

Jun 20 2016 3:37 PM | Updated on Aug 30 2018 4:07 PM

అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. కొట్నూరు చెర్వుకట్ట సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు మోటారుసైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాంద్‌పాషా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement