Chand pasha
-
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారుకావాలి
సైన్స్ ఉపాధ్యాయులు చొరవ చూపాలి భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌పాషా జోగిపేట: విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించి వారిని బాల శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత సైన్స్ ఉపాధ్యాయులదేనని భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌పాషా అన్నారు. 24వ భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్‌పై శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జోగిపేట డివిజన్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులను రూపొందించేలా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థుళను తీర్చిదిద్దాలన్నారు. సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశాలను, శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాజెక్టులు నిర్ణీత ఉప అంశాలపై ఎలా రూపొందించాలన్న విషయాన్ని ఆయన ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో రాష్ర్ట, జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొని ప్రదర్శించాలని ఆయన సూచించారు. సుస్థిర అభివృద్ధి విజ్ఞాన శాస్ర్తం, సాంకేతికత, వినూత్న ఆవిష్కరణ-దివ్యాంగులకు పిల్లలకు సౌలభ్యం అన్న అంశంపై విశదీకరించారు. డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్ మాట్లాడుతూ.. సైన్స్ కాంగ్రెస్‌పై ఉపాధ్యాయులు అవగతం చేసుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలని అధిగమించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సాంబశివరెడ్డి, ఎంఈఓ కృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ హెచ్ విజయ్‌కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి.అనిల్‌కుమార్, సిరి ఎన్జీఓ ఆర్గనైజర్ శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సతీష్‌కుమార్, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నరోత్తం పాల్గొన్నారు. -
రెండు బైక్‌లు ఢీ..ఒకరు మృతి
అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. కొట్నూరు చెర్వుకట్ట సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు మోటారుసైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాంద్‌పాషా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. -
దెయ్యాలు ఉన్నాయా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఈ విషయం గురించి పరిశోధన చేయడానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆనంద్‌కుమార్, అనూష జంటగా చాంద్‌పాషా దర్శకత్వంలో ఖాదర్‌బాబు, తారాబేగం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నవంబర్ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆనంద్, సహ-నిర్మాత: సల్మాన్‌ఖాన్. -
దెయ్యాలపై పరిశోధన
శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నజీరానూరి సమర్పణలో చాంద్ పాషా దర్శకత్వంలో బేగం, ఖాదర్‌బాబు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆనంద్‌కుమార్, రాజా, కార్తీక్, ‘రోషం’ బాలు, అనూష, స్వప్న ముఖ్య తారలు. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దేవీప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దెయ్యాలున్నాయా? అనే అంశంపై ముగ్గురు విద్యార్థులు పరిశోధన చేసి, బంగారు పతకం సాధిస్తారు. దెయ్యాలున్నాయని తేలిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఇది రొమాంటిక్ హారర్ మూవీ అని, 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. సన్నీ, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, సహనిర్మాత: సల్మాన్‌ఖాన్. -
హీరోయిన్ చేస్తానని.... గర్భవతిని చేశాడు
-
హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు
సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా మోసం చేసి.. తనను గర్భవతిని చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని తెలిపింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు శనివారం తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను శ్రీజను మోసం చేయాలని సదరు దర్శకుడు చెప్పటం విశేషం. బాధితురాలి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు సినిమాల్లో ఛాన్సు ఇప్పిస్తానంటూ సుమారు ఆరు లక్షల వరకూ తీసుకున్నాడని, దాంతో పాటు తన కుమార్తెను మోసం చేశాడని ఆరోపించింది. తనకు దర్శకులు, నిర్మాతలు తెలుసు అని చెప్పాడని.... పెళ్లి కాలేదని... పిల్లలు లేరని చాంద్ పాషా అబద్దాలు చెప్పాడని తెలిపింది. గతరాత్రి కొంతమంది తన కుమార్తెపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. తమకు తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది.