విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారుకావాలి | students should become scientists | Sakshi
Sakshi News home page

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారుకావాలి

Aug 27 2016 10:26 PM | Updated on Nov 9 2018 4:45 PM

విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించి వారిని బాల శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత సైన్స్‌ ఉపాధ్యాయులదేనని భారత బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ర్ట కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చాంద్‌పాషా అన్నారు.

  • సైన్స్‌ ఉపాధ్యాయులు చొరవ చూపాలి
  • భారత బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ర్ట కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చాంద్‌పాషా
  • జోగిపేట: విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించి వారిని బాల శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత సైన్స్‌ ఉపాధ్యాయులదేనని భారత బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ర్ట కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చాంద్‌పాషా అన్నారు. 24వ భారత బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌పై శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జోగిపేట డివిజన్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

    ప్రాజెక్టులను రూపొందించేలా సైన్స్‌ ఉపాధ్యాయులు విద్యార్థుళను తీర్చిదిద్దాలన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ ఉద్దేశాలను, శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాజెక్టులు నిర్ణీత ఉప అంశాలపై ఎలా రూపొందించాలన్న విషయాన్ని ఆయన ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో రాష్ర్ట, జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొని ప్రదర్శించాలని ఆయన సూచించారు.

    సుస్థిర అభివృద్ధి విజ్ఞాన శాస్ర్తం, సాంకేతికత, వినూత్న ఆవిష్కరణ-దివ్యాంగులకు పిల్లలకు సౌలభ్యం అన్న అంశంపై విశదీకరించారు. డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్‌ మాట్లాడుతూ.. సైన్స్‌ కాంగ్రెస్‌పై ఉపాధ్యాయులు అవగతం చేసుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలన్నారు.

    విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలని అధిగమించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ సాంబశివరెడ్డి, ఎంఈఓ కృష్ణ, జిల్లా కోఆర్డినేటర్‌ హెచ్‌ విజయ్‌కుమార్‌, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ పి.అనిల్‌కుమార్‌, సిరి ఎన్‌జీఓ ఆర్గనైజర్‌ శ్రీనివాస్‌, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సతీష్‌కుమార్‌, పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి నరోత్తం పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement