హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు | Artist Srija complains on director chand pasha | Sakshi
Sakshi News home page

హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు

Dec 7 2013 8:28 AM | Updated on Aug 28 2018 4:30 PM

హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు - Sakshi

హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు

సినిమా దర్శకుడు చాంద్ పాషా అనే వ్యక్తి తనను సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ మోసం చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా మోసం చేసి..  తనను గర్భవతిని చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని తెలిపింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు శనివారం తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను శ్రీజను మోసం చేయాలని సదరు దర్శకుడు చెప్పటం విశేషం.

బాధితురాలి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు సినిమాల్లో ఛాన్సు ఇప్పిస్తానంటూ సుమారు ఆరు లక్షల వరకూ తీసుకున్నాడని, దాంతో పాటు తన కుమార్తెను మోసం చేశాడని ఆరోపించింది. తనకు దర్శకులు, నిర్మాతలు తెలుసు అని చెప్పాడని.... పెళ్లి కాలేదని... పిల్లలు లేరని చాంద్ పాషా అబద్దాలు చెప్పాడని తెలిపింది. గతరాత్రి కొంతమంది తన కుమార్తెపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.  తమకు తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement