స్వైన్‌ఫ్లూతో ఒకరు మృతి | one died with swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో ఒకరు మృతి

Feb 6 2017 10:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

స్వైన్‌ఫ్లూ లక్షణాలతో 8 ఏళ్ల చిన్నారి వైష్ణవి మృతి చెందగా, మరో ఆరునెలల చిన్నారి జెస్సికను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు.

  మరొకరు హైదరాబాద్‌కు తరలింపు
నంద్యాల: స్వైన్‌ఫ్లూ లక్షణాలతో 8 ఏళ్ల చిన్నారి వైష్ణవి మృతి చెందగా, మరో ఆరునెలల చిన్నారి జెస్సికను   హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ చిన్నారులకు చికిత్స చేసిన పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ యాజమాన్యం ఈ విషయాన్ని వెలుగులోకి రానివ్వకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 
 
రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో సహా నంద్యాలకు వలస వచ్చి విశ్వనగర్‌లో నివాసం ఉన్నారు. దాదాపు 15 రోజుల క్రితం  వైష్ణవికి తీవ్ర జ్వరం, నీరసంతో పాటు వాంతులు కావాడంతో  ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ చినా​‍్నరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వైద్యుడి సలహా మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె కోలుకోలేక గత నెల 28న మృతి చెందింది. తర్వాత ఈమె బంధువులకు చెందిన మరో చిన్నారి జెస్సిక కూడా ఆ వ్యాధి లక్షణాలతో నంద్యాలలోని అదే ఆసుపత్రిలో చేరింది. ఈచిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వైద్యుడి సలహా మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే చిన్నారులు, వారి తల్లిదండ్రుల వివరాలు ఇవ్వడానికి యాజమాన్యం సహకరించడం లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement