లారీ–డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి | one died in road accident in shamshabad | Sakshi
Sakshi News home page

లారీ–డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి

Nov 2 2016 9:06 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

శంషాబాద్‌(రంగారెడ్డి): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ఘన్షిమియాగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement