ధరూరు శివారులోని మైసమ్మ గుడిలోకి ఆదివారం సాయంత్రం ఒక ద్విచక్రవాహనం దూసుకుపోయింది.
ధరూరు (రంగారెడ్డి జిల్లా) : ధరూరు శివారులోని మైసమ్మ గుడిలోకి ఆదివారం సాయంత్రం ఒక ద్విచక్రవాహనం దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా మోటార్‌బైక్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న మైసమ్మ గుడిలోకి దూసుకుపోయింది.
మృతుడు పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన అంజయ్య(25)గా పోలీసులు గుర్తించారు. అల్లీపూర్‌కు చెందిన శాంతయ్య అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.