12న రజకుల వివాహ పరిచయ వేదిక | On the platform 12 rajakula wedding intro | Sakshi
Sakshi News home page

12న రజకుల వివాహ పరిచయ వేదిక

Mar 4 2017 11:59 PM | Updated on Sep 5 2017 5:12 AM

ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

కడప రూరల్‌ : ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనే రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేదికకు హాజరయ్యే వారు వధూవరుల ఫుల్‌ఫోటో, పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 96427 10496 నెంబరులో సంప్రదించాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement