రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి | old woman dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

Feb 16 2017 11:18 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది.

బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వడియంపేటకు చెందిన పామిశెట్టి పోలేరమ్మ (70) అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద బొలెరో వాహనాన్ని రివర్స్‌ తీసుకుంటూ పోలేరమ్మను ఢీకొన్నాడు. దీంతో  తీవ్రగాయాలపాలైన పోలేరమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement