గుంతలో పడి వృద్ధురాలి మృతి | old woman dies fall into well | Sakshi
Sakshi News home page

గుంతలో పడి వృద్ధురాలి మృతి

Jun 15 2017 11:48 PM | Updated on Jul 11 2019 8:55 PM

లేపాక్షి రెవెన్యూ కార్యాలయం ఎదుట గల చింతతోపులోని గుంతలో పడి ఇదే మండలం రాజీవ్‌కాలనీకి చెందిన బి.ఎల్‌.నరసమ్మ(70) గురువారం మృతి చెందిన ఏఎస్‌ఐ సుబ్బరాం నాయక్‌ తెలిపారు.

లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి రెవెన్యూ కార్యాలయం ఎదుట గల చింతతోపులోని గుంతలో పడి ఇదే మండలం రాజీవ్‌కాలనీకి చెందిన బి.ఎల్‌.నరసమ్మ(70) గురువారం మృతి చెందిన ఏఎస్‌ఐ సుబ్బరాం నాయక్‌ తెలిపారు. వృద్ధురాలు అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయేదన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. చివరకు చింతతోపులోని గుంతలో పడి మృతి చెంది ఉండగా పశువుల కాపరులు గుర్తించారన్నారు. వెంటనే తమకు సమాచారం అందించడంతో సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఆరా తీయగా.. రాజీవ్‌కాలనీకి చెందిన నరసమ్మ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీరామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement