వడదెబ్బతో వృద్ధుడు మృతి | old man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడు మృతి

Mar 22 2017 11:42 PM | Updated on Sep 5 2017 6:48 AM

తాడిమర్రి మండలం తురవారిపల్లికి చెందిన కాటం కాటమయ్య(70) అనే వృద్ధుడు వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం తురవారిపల్లికి చెందిన కాటం కాటమయ్య(70) అనే వృద్ధుడు వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటమయ్య మంగళవారం పగలంతా వ్యవసాయ పనులు చేశాడు. సాయంత్రం ఐదు గంటల నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ జిల్లా పార్నపల్లికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పులివెందులలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతనికి భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement