వడదెబ్బకు గత 72 గంటల్లో 99 మంది మృతి | 99 People Died Due To Sun Stroke In 3 Dyas | Sakshi
Sakshi News home page

ఒడిశాలో వడగాడ్పుల విలయం.. 99 మంది మృతి!

Jun 3 2024 10:42 AM | Updated on Jun 3 2024 11:54 AM

99 People Died Due To Sun Stroke In 3 Dyas

దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.

ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్‌లలో నమోదయ్యిందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement