
లక్నో: భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం.. అవి విపరీత పరిణామాలకు దారి తీయడం మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు దంపతులు విచిత్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటివి చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ పరిధిలోని హరిహర్‌పూర్ నగర పంచాయతీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై, వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే యూపీలోని గోరఖ్‌పూర్‌లోగల సహజన్వాకు చెందిన ఖష్బూకు ఆరు నెలల క్రితం హరిహర్‌పూర్‌కు చెందిన కల్లూతో వివాహం జరిగింది. నెల్లాళ్ల తరువాత కల్లూ పని కోసం ముంబైకి వెళ్లాడు. అప్పటి నుంచి ఖుష్బూ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ నేపధ్యంలో ఆమెకు మరిది అమిత్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది ఇరు కుటుంబాలకు తెలిసింది. అలాగే చుట్టుపక్కల వారి నోళ్లలోనూ నానింది. దీంతో ఖుష్బూ, అమిత్‌లు ఇంటి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వారికోసం తమకు తెలిసిన అన్ని ప్రాంతాల్లోనూ వెదికి, చివరికి వారిని పట్టుకున్నారు. అయితే వారు తాము భార్యాభర్తలుగా ఎప్పటికీ కలిసివుంటామని అందరిముందు తేల్చిచెప్పారు.
విషయం హరిహర్‌పూర్ నగర పంచాయతీ చైర్మన్ రవీంద్ర ప్రతాప్ షాహి వరకూ చేరింది. ఆయన ఖుష్బూ, అమిత్‌లతో ఈ సంబంధం సరైనది కాదంటూ, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు తాము విడిగా ఉండలేమని పెద్దలందరి ముందూ స్పష్టం చేశారు. దీంతో ఇరు కుటుంబాల్లోని వారు ఖుష్బూ, అమిత్‌లకు వివాహం చేయాలని నిశ్చయించారు. పంచాయతీ కార్యాలయంలో ఖుష్బూ, అమిత్‌ల వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే వీరి వివాహానికి ఖుష్భూ భర్త కల్లూ హాజరు కాలేదు. తనకు ఇకపై ఖుష్బూతో ఎటుంటి సంబంధం లేదని కల్లూ తేల్చిచెప్పాడు.
ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్