కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం | officers ignored of give water to kc canal | Sakshi
Sakshi News home page

కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం

Jul 20 2016 6:53 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం - Sakshi

కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం

కడప –కర్నూలు కాలువకు నీరు అందించడంల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుష్పాల శ్రీనాధరెడ్డి విమర్శించారు.

మైదుకూరు టౌన్‌:
 
కడప –కర్నూలు కాలువకు  నీరు అందించడంల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుష్పాల శ్రీనాధరెడ్డి విమర్శించారు.  కాలువలు సరిగ్గా లేవని నీరు రావడం లేదనే సాకుతో జిల్లా రైతాంగం పట్ల చిన్న చూపు చూడడం తగదన్నారు. జిల్లాలో వేల ఎకరాలు నీరులేక బీళ్లు బారిపోయిందన్నారు. అధికారులు మాత్రం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.  కేసీ కాలువకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బీ.పీ వెంకట ప్రతాప్‌రెడ్డి, బీసీ గుర్రప్ప, శ్రీధర్‌బాబు, డి. రఘునాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement