ఉపాధి.. ఉత్తుత్తి! | nregs works..fruad | Sakshi
Sakshi News home page

ఉపాధి.. ఉత్తుత్తి!

Jul 20 2016 11:49 PM | Updated on Aug 10 2018 9:46 PM

ఉపాధి.. ఉత్తుత్తి! - Sakshi

ఉపాధి.. ఉత్తుత్తి!

పత్తికొండ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం అభాసు పాలవుతోంది. పనులు చేయకపోయినా తప్పుడు లెక్కలతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోజువారీ ఉపాధి పనులతో పాటు ఫారంపాండ్స్, ఇంకుడు గుంతలు, నీరు–చెట్టు కార్యక్రమాల్లో భారీగా బోగస్‌ పనులను చేసి.. కోట్లలో బిల్లులు కాజేశారనే విమర్శలు ఉన్నాయి.

పత్తికొండలో ఇష్టారాజ్యం
– పనులు చేయకుండానే రూ.కోట్లలో బిల్లులు
– తప్పుడు లెక్కలతో అధికార పార్టీ నేతల భోజ్యం
– సీఎంఓకు మరో వర్గం ఫిర్యాదు
– ఆధారాలతో సహా పంపిన వైనం
– విచారణ కొనసాగకుండా మోకాలడ్డు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:
పత్తికొండ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం అభాసు పాలవుతోంది. పనులు చేయకపోయినా తప్పుడు లెక్కలతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోజువారీ ఉపాధి పనులతో పాటు ఫారంపాండ్స్, ఇంకుడు గుంతలు, నీరు–చెట్టు కార్యక్రమాల్లో భారీగా బోగస్‌ పనులను చేసి.. కోట్లలో బిల్లులు కాజేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంఓ) ఫిర్యాదులు వెళ్లాయి. అధికార పార్టీలోని మరో వర్గమే ఈ ఫిర్యాదుల చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీఎంఓకు వెళ్లిన ఈ ఫిర్యాదులపై విచారణ జరగకుండా అధికార పార్టీలోని మరో వర్గం అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాత పనులకే మెరుగులు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్టు చూపడం, యంత్రాలతో పనులు చేయించి కూలీలతో చేయించినట్టు చూపి డబ్బు కాజేయడం జరుగుతోంది. అయితే, పత్తికొండ నియోజకవర్గంలో మాత్రం ఈ వ్యవహారం మరింత ముదిరి పాకానపడింది. ప్రధానంగా వెల్దుర్తి, కష్ణగిరి మండలాల్లో గతంలో చేసిన పనులకే కొత్తగా మెరుగులు దిద్దుతూ బిల్లులు కాజేస్తున్నారు. నీరు–చెట్టుతో పాటు ఫారం పాండ్స్‌లో ఈ రకంగా భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ కొనసాగింది. పనుల్లో కొన్ని అక్రమాలు జరిగినట్టు కూడా నిర్ధారించినట్టు సమాచారం. ఈ వివరాలతో పాటు ఫారంపాండ్స్‌ పనులు, రోజువారీగా ఉపాధి పనుల్లో జరుగుతున్న తతంగంపై ఆధారాలతో సహా అధికార పార్టీలోని మరో వర్గం సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

జేసీబీలతో పనులు
ప్రధానంగా పంట కుంటల(ఫారంపాండ్స్‌) పనులను ఉపాధి కూలీలతోనే చేయించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే, పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కష్ణగిరి మండలాల్లో జేసీబీలతోనే పనులు కానిచ్చారు. ప్రధానంగా అధికార పార్టీ నేతకు చెందిన జేసీబీలతోనే పనులు చేయించి.. కూలీలతో చేయించినట్టు లెక్కలు చూపి వచ్చిన బిల్లులను సదరు నేత అకౌంట్లలోకి జమ చేశారు. అదేవిధంగా గతంలో ఉన్న ఫారంపాండ్స్‌కే చుట్టూ కొత్తగా కొద్ది మంది కూలీలతో పనులు చేయించి మొత్తం కొత్తగా పాండ్స్‌ తవ్వినట్టు చూపి బిల్లులు కాజేశారు. మొత్తం మీద స్వయంగా డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆరోపణలు రావడం.. అదీ సొంత పార్టీ నుంచే రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement